మిగులు భూములు పేదలకు పంచాలి…
1 min read

రాష్ట్రవ్యాప్తంగా భూ పంపిణీ చేపట్టాలి…. వ్యవసాయ కార్మిక సంఘం
న్యూస్ నేడు, పత్తికొండ : ప్రభుత్వ భూములు కార్పొరేట్ సంస్థలకు పెద్దలకు అప్పచెప్పుతున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన పేదలకు భూములు పంపిణీ చేయాలని, అసైన్మెంట్ కమిటీ పునరుద్ధరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం నాడు వ్యవసాయ కార్మిక సంఘం పత్తికొండ మండలం మహాసభలు బుజ్జులు అధ్యక్షతన స్థానిక ఈశ్వర్ రెడ్డి భవన్లోని పొట్లపాడు గోవిందు మెమోరియల్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా వీరశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా మిగులు భూములను బడా కార్పొరేటు, ప్రభుత్వ పెద్దలకు 99 పైసలకే ఎకరా అప్పజెప్తున్న ప్రభుత్వం పేదలకు భూమి పంపిణీ చేయడానికి మనసు ఒప్పడం లేదని ఇది పేదల పట్ల ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల భూమిని ఇల్లు లేని నిరుపేదలకు ఇస్తామని ఇల్లు కట్టిస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది పేదలకు భూమి ఇచ్చిందో చెప్పాలని వారు ఆయన డిమాండ్ చేశారు సూపర్ సిక్స్ అమలు అర కోరగా ఉందన్నారు పింఛన్ కొరకు అర్హులైన వేలమంది రాష్ట్రంలో ఉన్నారని కొత్త పింఛన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం ఇప్పటికి సరైన వైఖరితో లేదని అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర కు పాల్పడుతుందని చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర వాటాను 40% ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారని పేర్కొన్నారు, అందరికీ పని కల్పించాలని వారు డిమాండ్ చేశారు .


