NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక కు సహకరించండి

1 min read

జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

కర్నూలు , న్యూస్​ నేడు : జిల్లా ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) తయారు చేసేందుకు సమాచారం అందించాలని  జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్  అధికారులను ఆదేశించారు. బుధవారం  కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లోఆర్థిక అభివృద్ధి ప్రణాళిక రూపొందించడంపై సంబంధిత శాఖల అధికారులతో జేసీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్  మాట్లాడుతూ ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక తయారు చేయటానికి పారిశ్రామిక వాడల లేఅవుట్ లు , జిల్లా ఇండస్ట్రియల్ జోన్ వివరాలు , క్లస్టర్ల సరిహద్దులు , సెమీ కండక్టర్, డ్రోన్ పరిశ్రమల మరియు ఇతర పరిశ్రమల స్థాపన వివరాలు , పరిశ్రమల కొరకు ప్రైవేటు మరియు ప్రభుత్వ భూముల వినియోగం వివరాలు, పరిశ్రమలకు అందించనున్న కరెంటు సౌకర్యం – వివిధ పద్ధతుల ద్వారా ఉత్పత్తి వాటి వివరాలు , జిల్లాలో నీటి లభ్యత పరిశ్రమలకు అందించే వాటా , జిల్లాలో ఉన్న నేషనల్ హైవేస్ మరియు ఇతర మార్గాల వివరాలు క్రొత్తగా ఏర్పాటు చేస్తున్న రోడ్ల వివరాలు , రాష్ట్రంలో జిల్లాలో ఉన్న నదుల , చెరువుల వివరాలు  సంభవించే వరదల వివరాలు , వాతావరణ పరిస్థితులు మరియు కాలుష్య నివారణ కు  తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలు అందించవలసిందిగా అధికారులను కోరారు.ఈ సమావేశంలో  అధికారులు జి ఎం ఇండస్ట్రీస్ అశోక్ కుమార్ , ఆర్ అండ్ బి ఎస్ ఈ మహేశ్వర్ రెడ్డి , ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ విద్యా సాగర్, ఎస్ ఈ ( ట్రాన్స్కో ప్రాజెక్ట్స్ )బాబు రాజేంద్ర, ఎస్ ఈ ఆపరేషన్ వెంకటేశ్వర్లు , ఎస్ ఈ ఇరిగేషన్ బాలచంద్రారెడ్డి , కర్నూలు ఆర్డిఓ సందీప్ కుమార్ ,  పొల్యూషన్ కంట్రోల్ ఈ ఈ కిషోర్ రెడ్డి, సి పి ఓ భారతి, ఎంప్లొయ్ మెంట్ ఆఫీసర్ దీప్తి ,  కు డా ప్రాజెక్ట్ ఆఫీసర్ మోహన్ కుమార్ , అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సతీష్ రెడ్డి , జెడ్ ఎం మధుసూదన్ మొదలగువారు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *