వాహనాల బహిరంగ వేలం – కర్నూలు ట్రాఫిక్ పోలీసు స్టేషన్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: శ్రీ విక్రాంత్ పాటిల్, ఐ.పి.ఎస్., సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆదేశాల మేరకు మరియు శ్రీ జె. బాబూ ప్రసాద్, సబ్ డివిజనల్ పోలీసు అధికారి, కర్నూలు ఉత్తర్వుల మేరకు, ఎస్. మన్సూరుద్దిన్, ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీసు ఆధ్వర్యంలో కర్నూలు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో సీజ్ చేయబడి, యజమానులు లేని/దావా లేని పాత వాహనాల బహిరంగ వేలం నిర్వహణ. కర్నూలు పట్టణ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడి, సుదీర్ఘకాలంగా కర్నూలు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఆవరణలో నిలిపి ఉంచిన మరియు యజమానులు ఎవరూ క్లెయిమ్ చేయని క్రైమ్.నం. 257/2025 కేసులో గల 31- ద్విచక్ర వాహనాలు, 2-ఆటోలను ఆంధ్రప్రదేశ్ పోలీసు చట్టం మరియు కోర్టు ఆదేశాల ప్రకారం బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి నిర్ణయించడమైనది.వేలం వివరాలు: తేదీ: 14.04.2026సమయం: ఉదయం 10.00 గంటల నుండి.వేలం జరుగు స్థలం: కర్నూలు ట్రాఫిక్ పోలీసు స్టేషన్, కొత్తపేట, కర్నూలు నిబంధనలు మరియు షరతులు: 1. పాల్గొనుట: వేలంలో పాల్గొనేవారు తమ ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు తగిన గుర్తింపు కార్డులతో హాజరు కావాలి. 2. ముందస్తు డిపాజిట్: వాహనంపై వేలం పాట పాడే ముందు, నిర్ణీత మొత్తం (EMD) [Rs. 1000/-] ను డిపాజిట్ చేయాలి. 3. చెల్లింపు: వేలంలో వాహనం గెలుచుకున్న వారు, అదే రోజున మొత్తం డబ్బును చెల్లించి వాహనాన్ని తీసుకువెళ్లాలి. 4. పరిశీలన: వాహనాలను వేలం రోజు ఉదయం 9 గంటల నుండి పరిశీలించవచ్చు. 5. నిర్ణయం: వేలం నిర్వహణ విషయంలో పోలీసు అధికారుల నిర్ణయమే అంతిమం. ఆసక్తి గల ప్రజలు, వాహన యజమానులు (ఏమైనా ఉంటే) ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కర్నూలు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఇన్స్ పెక్టర్ శ్రీ ఎస్. మన్సూరుద్దిన్ తెలపడమైనది.

