ప్రజలందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ..అవగాహన కలిగి ఉండాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ అధినేత డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కర్నూలు వెంకటరమణ కాలనీ రామలింగేశ్వర నగర్ పార్కు నందు ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి హాజరయ్యారు. జడ్జి మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ మరియు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.అలాగే ఉచిత కంటి మరియు హెల్త్ చెకప్ లను చేయించుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. అనంతరం డాక్టర్ జయప్రకాష్ కంటి వైద్య నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్స్ డాక్టర్ రంగనాథ్, యుగంధర్,కార్డియాలజీ డాక్టర్ ప్రమోద్ కుమార్,చిల్డ్రన్ స్పెషలిస్ట్ రమేష్ ల ఆధ్వర్యంలో కాలనీ వాసులకు కంటి మరియు హెల్త్ చెకప్ లను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్ మెంబర్స్ లయన్ గోపీనాథ్, లయన్ మురారి శంకరప్ప, లయన్ కే డి జే బాబు, మంజునాథ, రాజేశ్వర్ రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపులో మొత్తం 150 మందికి పైగా ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారని డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు.

