డ్రాగన్ బోట్ పోటీల నిర్వహణలో ఏకపక్ష నిర్ణయం తగదు
1 min read

ఏపీ డ్రాగన్ బోట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవినాష్ గుప్తా
కర్నూలు , న్యూస్ నేడు: రాజమండ్రిలో మే 30,31 తేదీల్లో జరిగే అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ పోటీల నిర్వహణ విషయంలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని పోటీల నిర్వహణకు దిగడం సమంజసం కాదని ఏపీ డ్రాగన్ బోట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవినాష్ గుప్తా ఆరోపించారు.ఈ మేరకు కర్నూలు సమాచార శాఖ కార్యాలయం వద్ద ఉన్న మీడియా రూమ్ వద్ద ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయంగా డ్రాగన్ బోట్ పోటీలు గానీ,లీగ్ లను నిర్వహించాలంటే అంతర్జాతీయ డ్రాగన్ బోట్ ఫెడరేషన్ ఉందన్నారు.కానీ ఈ అసోసియేషన్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ది అవుట్ సైడ్స్ సంస్థ ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఇండియన్ కేయాకింగ్,కేనోయింగ్ అసోసియేషన్ లు సంయుక్తంగా ఇంటర్నేషనల్ డ్రాగన్ లీగ్ పోటీలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. భారతదేశంలో డ్రాగన్ బోట్ పోటీలను నిర్వహించేందుకు డ్రాగన్ బోట్ ఇండియా అండ్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కు ఏసియన్ డ్రాగన్ బోట్ ఫెడరేషన్, అంతర్జాతీయ డ్రాగన్ బోట్ ఫెడరేషన్ అధికారిక గుర్తింపు ఇచ్చిందని వెల్లడించారు.భారత్ లో 13 ఏళ్లుగా డ్రాగన్ బోట్ ఇండియా,ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించి ఏసియా, అంతర్జాతీయ పోటీలకు అధికారికంగా జట్లను పంపినట్లు గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులుడ్రాగన్ బోట్ ఇండియా అండ్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ తో పాటు ఆంధ్రప్రదేశ్ డ్రాగన్ బోట్ అసోసియేషన్ కు సమాచారం అందించి పోటీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.లేదంటే ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలతో పోటీలు నిర్వహిస్తే ఊరుకోమన్నారు.ఇప్పటికైనా తమతో సంప్రదింపులు చేసి పోటీలు నిర్వహించాలని,లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

