NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న్యాయవాది ఎల్లయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి 

1 min read

పత్తికొండలో న్యాయవాదుల నిరసన  

న్యూస్ నేడు, పత్తికొండ: పీలేరు న్యాయవాది పూజారి ఎల్లయ్య ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు  వై.మధుబాబు డిమాండ్ చేశారు. గురువారం పత్తికొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి  కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు న్యాయవాది పూజారి ఎల్లయ్య ను  కొందరు గుర్తు తెలియని దుండగులు రాత్రివేళ ఇంటిలోకి చొరబడి అతనిపై దాడి చేసి చంపడమే కాకుండా అడ్డువచ్చిన పూజారి ఎల్లయ్య తల్లిదండ్రులను గాయ పరచడమైనదన్నారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ప్రతిచోట జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. న్యాయవాది ఎల్లయ్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. ఈ  కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రవికుమార్, జనరల్ సెక్రెటరీ జగదీష్, లైబ్రరీ సెక్రెటరీ నరసరావు, సీనియర్ న్యాయవాదులు ఎల్లారెడ్డి, సత్యనారాయణ, కృష్ణయ్య, మహేష్, ప్రసాద్ బాబు, రంగస్వామి, పంపాపతి, దామోదర్ ఆచారి, మరియు జూనియర్ న్యాయవాదులు వీరాస్వామి, వెంకటేశ్వర్లు, అరుణ్ కుమార్, నెట్టేకల్, మునయ్య, వాసుదేవ నాయుడు, మధు తదితరులు పాల్గొన్నారు.

About Author