మోడల్ పాఠశాలలో ఆరవ తరగతికి ప్రవేశ పరీక్ష
1 min read

పాఠశాల ప్రిన్సిపాల్ బిటి శ్రీదేవి..
మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో ఆరవ తరగతిలో చేరుటకు ఈనెల 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ బిటీ శ్రీదేవి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆరవ తరగతిలో 100 సీట్లకు గాను 160 మంది విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకున్నారని వీరందరికీ ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉ 10 గంటల నుండి 12 గంటల వరకు మోడల్ పాఠశాలలో పరీక్ష ఉంటుందని విద్యార్థులు ఒక గంట ముందుగానే పాఠశాల వద్దకు చేరుకోవాలన్నారు.ఆన్ లైన్ చేసిన విద్యార్థులు హాల్ టికెట్ తెచ్చుకోవాలి హాల్ టికెట్లో ఫోటో సరిగ్గా లేకపోతే విద్యార్థుల రెండో పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తప్పనిసరిగా ఉండాలి అదేవిధంగా ప్రతి విద్యార్థి ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని ప్రిన్సిపాల్ అన్నారు.ఈ అవకాశాన్ని విద్యార్థులు గమనించాలని ప్రిన్సిపాల్ సూచించారు.

