NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“ప్రజా వేదిక”కు అపూర్వ స్పందన

1 min read

– ఆలూరులో విజయవంతంగా గ్రీవెన్స్ డే నిర్వహణ

ప్రజల సమస్యల పరిష్కారానికి టిడిపి అండగా ఉంటుందని వైకుంఠం జ్యోతి హామీ

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్  వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన “ప్రజా వేదిక – గ్రీవెన్స్ డే” కార్యక్రమం ప్రజల అపూర్వ స్పందనతో అత్యంత విజయవంతంగా ముగిసింది.నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి తమ సమస్యలను విన్నవించారు. వ్యక్తిగత సమస్యలు, గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలు, మౌలిక వసతుల లోపాలు, సంక్షేమ పథకాల అమలు వంటి పలు విషయాలను ప్రజలు జ్యోతి దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి  ప్రతి ఒక్కరినీ ఓపికగా పరామర్శించి, వారి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ప్రజల సమస్యే మా సమస్య. ప్రతి అర్జీని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ ప్రజల అండగా నిలుస్తుంది” అని స్పష్టం చేశారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు మరియు పెద్ద ఎత్తున హాజరైన ప్రజలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *