పార్టీకి అండగా నిలబడే వారే కార్యకర్త
1 min read

ఆరోగ్య కేంద్రం ప్రారంభం-వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే..
నందికొట్కూరు న్యూస్ నేడు: కష్టకాల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడే వారే కార్యకర్త అని కార్యకర్తల సేవలను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య కొనియాడారు.నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామంలో శుక్రవారం ఉదయం 36 లక్షలతో నూతనంగా నిర్మించనున్నఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. లక్ష్మాపురం,ఘణపురం గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు జయరామి రెడ్డికి-47,726, సలీం భాష 25 వేలు, శంకరమ్మ-42 వేల రూపాయల చెక్కులను అందజేశారు.తర్వాత అల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.తర్వాత తెలుగుదేశం పార్టీ నందికొట్కూరు కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీకి మార్గదర్శకులు కార్యకర్తలేనని పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మై టీడీపీ యాప్‌లో పార్టీ నిర్దేశించిన అంశాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని ఎమ్మెల్యే కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాండ్ర కన్వీనర్ సురేంద్రనాథ్ రెడ్డి, పగిడాల ఎంపీడీవో సుమిత్రమ్మ,తహసిల్దార్, సొసైటీ చైర్మన్ దామోదర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి,భూషిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

