పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించండి: ఎన్జీజీఓ నేతలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ముందుగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఏపీఎన్జీవో సంఘం కర్నూలు జిల్లా సంఘ పక్షాన పూలతో నివాళులు అర్పించి, పేద బడుగు బలహీన వర్గాల సమాజానికి ఆయన చేసిన సేవలను మరియు సమాజానికి ఆయన నేర్పించిన విద్యాభ్యాసం ను గురించి కొనియాడడం జరిగినది. తర్వాత సమావేశం నందు ఎన్జీఓ నేతలు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖాళీగా ఉన్న 75 స్థానాల్లో గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలని ఏపీ ఎన్జీజీఓ కర్నూలు జిల్లా అధ్యక్షులువి.జవహర్ లాల్ అన్నారు. ఈ మేరకు శనివారం కర్నూలు ఎన్జీఓ హోం నందు నిర్వహించిన నవీన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంఘటితంగా ఉంటేనే ఉద్యోగుల ప్రయోజనాలను సాధించగలమని చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, బకాయిల సాధన కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంను రాష్ట్ర సంఘ అధ్యక్షులు కామ్రేడ్ ఆలపర్తి విద్యాసాగర్ దృష్టికి మీ సమస్యలను కర్నూలు జిల్లా సంఘ పక్షాన తీసుకువెళ్లి పరిష్కారం దిశగా ముందుకు వెళ్దామని హామీ ఇవ్వడం జరిగినది. అనంతరం ప్రధాన కార్యదర్శి ఎం.సి.కాశన్న మాట్లాడుతూ గ్రేడ్ -3 పంచాయతీ అభివృద్ధి అధికారులకు మంజూరు చేసిన వేతనశ్రేణిని తగ్గించడం ఆవేదన కలిగించే అంశం అన్నారు. ఆశ కల్పించి వెనక్కు తగ్గడం సబబు కాదని దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. నవీన పంచాయతీ కార్యదర్శుల సంఘం కన్వీనర్ గిరి శ్రీకాంత్ మాట్లాడుతూ సమస్యల సాధనకు కలిసి పనిచేయాలని, సంఘటితమే సంఘ హితమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి, ఆదోని కార్యదర్శి బజారి, ఎమ్మిగనూరు కార్యదర్శి వరప్రసాద్, కర్నూల్ నగర అసోసియేటెడ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు,ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, మరియు పంచాయతీ కార్యదర్శులు సంఘం నేతలు టిఎం నరేష్, ప్రశాంత్, జనార్ధన్, హిషాం, రాజ్ కమల్, శివన్న, రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.

