వేసవి టైక్వాండో బాక్సింగ్ శిక్షణ శిబిరం
1 min read

మాజీ మంత్రివర్యులు టీజీ వెంకటేష్
గోడ పోస్టర్ ఆవిష్కరణ
కర్నూలు, న్యూస్ నేడు: నగరంలో ఉదయం సంకల్పాగ్ లో ఉన్న టీజీ.వెంకటేష్ స్వగృహం నందు టైక్వాండో క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిశారుటీజీవి టీజీ బి టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కేంద్రాలు నిర్మిస్తున్నట్లు అకాడమీ వ్యవస్థాపకులు టి వెంకటేశ్వర్లు తెలియజేశారు .మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా వేసవి శిక్షణ శిబిరాలు గోడ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. నగరంలో కొన్ని శిక్షణ కేంద్రాలలో టీజీవి టీజీ బి టైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు మాట్లాడుతూ ఉచిత మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు మీ పిల్లలకు సమయం కేటాయించి వృధా చేయకుండా గా పిల్లలకు శిక్షణ కేంద్రంకు పంపించాలని తెలియజేయడం జరిగింది టైక్వాండో బాక్సింగ్ శిక్షణ కేంద్రము 1 పెద్ద మార్కెట్ కింగ్ పార్క్2 కొండారెడ్డి బురుజు3 కిడ్స్ వరల్డ్ పార్క్ లో 4 వెంకటరమణ కాలనీ KMC పార్కులో 5 బి .క్యాంప్ గ్రౌండ్ 6 ఫర్మన్ డిగ్రీ కళాశాల 7 గణేష్ నగర్ లో ఉన్నశిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ శిక్షకులు టి వెంకటేశ్వర్లు టైక్వాండో కార్యదర్శి టి అజయ్ బాక్సింగ్ కార్యదర్శి టీ తేజ మధు కుమార్ సతీష్ కుమార్ మల్లికార్జున్ మున్నావర్ తదితరులు పాల్గొన్నారు.

