NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సకాలంలో అంగన్వాడి కేంద్రాలకు బియ్యం పంపిణీ చేయాలి

1 min read

జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

కర్నూలు,  న్యూస్​ నేడు: జిల్లాలోని అన్ని అంగన్వాడి కేంద్రాలకు బియ్యం సరఫరా సకాలంలో, నాణ్యతతో జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్  నూరుల్ ఖమర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కర్నూలు నగరంలోని సివిల్ సప్లై బఫర్ గోదాంను ఆయన సందర్శించి,  ప్యాకింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాలకు పంపిణీ చేయబడుతున్న 3 కిలోల మరియు 25 కిలోల బియ్యం ప్యాకెట్ల తయారీ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్యాకింగ్ విధానం, నాణ్యత ప్రమాణాలు, సరఫరా వ్యవస్థపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని 1886 అంగన్వాడి కేంద్రాలకు ప్రతి నెల సరఫరా జరిగే బియ్యం ప్యాకెట్ల తయారీ మరియు పంపిణీలో ఎలాంటి ఆలస్యం లేకుండా సమయపాలన కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ లోపు ప్యాకెట్ల తయారీ పూర్తి చేసి, వెంటనే పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. ప్యాకింగ్ ఏజెన్సీ  ప్రతినిధులతో, ప్యాకింగ్ నాణ్యత, తూకం సరైన విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్యాకింగ్ ఏజెన్సీ ను ఆదేశించారు. సరఫరా వ్యవస్థలో పారదర్శకత, సమర్థత పెంపొందించడంతో పాటు, ఎటువంటి లోపాలు చోటు చేసుకోకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలకు సమయానికి సరఫరా జరిగితేనే గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు సరైన పోషకాహారం అందుతుందని పేర్కొంటూ, ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డీ.ఎం ఎన్. వెంకట రాముడు, సంబంధిత సిబ్బంది మరియు ప్యాకింగ్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *