NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తర్తూరు హుండీ  ఆదాయం 16 లక్షలు

1 min read

ఆలయ ఈవో సాయికుమార్..

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తర్తూరు శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి దేవాలయ హుండీ లెక్కింపులో దేవాలయానికి 16 లక్షల 11,871 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏ సాయికుమార్ అన్నారు.ఆలయ చైర్మన్ మందడి నారాయణరెడ్డి మరియు ఆలయ ఈవో ఆధ్వర్యంలో దేవాలయంలో అర్చకులు సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ అభివృద్ధికి ఈ నగదును ఉపయోగిస్తున్నట్లు జరిగిన తిరుణాల బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగినందుకుగాను ప్రజలకు అధికారులకు పోలీసులకు మరియు సిబ్బందికి ఆలయ ఈవో సాయికుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *