పొదుపు గ్రూపుల పలు సమస్యలు గుడిసె ఆది కృష్ణమ్మ దృష్టికి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కుప్పగల్లు గ్రామ ప్రజలు పొదుపు గ్రూపులకు సంబంధించిన పలు సమస్యలపై వచ్చి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ దృష్టికి తీసుకురావడం జరిగింది.ఈ సందర్భంగా స్పందించిన జిల్లా అధ్యక్షురాలు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

