డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేద్దాం
1 min read

మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం జిల్లా అధ్యక్షులు నగేష్
చాగలమర్రి న్యూస్ నేడు: రాజ్యాంగ పితామహుడు, దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గ్రామాలలో, మండల కేంద్రాలలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు కమటం నాగేష్ అన్నారు. సోమవారం అయిన విలేకరులతో మాట్లాడుతూ వివిధ మతాలు, వివిధ కులాల వారు ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశంలో ఉండగా , కులాలను మతాలను వేరుచేసి దళితుల మధ్య వర్గ విభేదాలు సృష్టించడం తగదని అన్నారు. అంబేద్కర్ ఒక కులానికి ఒక మతానికే కాదు అందరివాడని ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

