పేరుకుపోయిన భూ సమస్యలు.. పరిష్కార దిశలో తహసిల్దారు
1 min read

చాగలమర్రి, న్యూస్ నేడు: మండలంలోని వివిధ గ్రామాలలో గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన భూ సమస్యలను నూతనంగా విధుల్లో చేరిన తహసిల్దార్ ఫణీంద్రుడు యుద్ధ ప్రాతిపదికన పరిష్కార దిశలో రికార్డులను పరిశీలించి సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో (పి జి ఆర్ ఎస్) లో వచ్చిన ఫిర్యాదులకు స్పందించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పరిష్కరించుటకై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చిన అర్జీలను పరిశీలించారు. రేషన్ కార్డులు కొరకు, పొలాలకు వెళ్లే రాస్తా, రికార్డులలో తప్పులతడకగా నమోదైన భూములు ఇంటి స్థలాలు, భూముల ఆక్రమణలు, పట్టాదారు పాసుపుస్తకాలు, ఆన్లైన్లో నమోదు కార్యక్రమాలు, పట్టా భూముల్లో దౌర్జన్యంగా ఆక్రమించడానికి సాగు చేస్తున్న వారిపై వచ్చిన అర్జీలను పరిశీలించారు. గతంలో పనిచేసిన ఇన్చార్జి తహసిల్దార్ నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో పలు సమస్యలు పేరుకుపోయాయని రైతులు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తాహిర్ హుస్సేన్, పంచాయతీరాజ్ ఇంజనీర్ కొండారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి రంగ నేతాజీ, వివిధ శాఖ అధికారులు హాజరయ్యారు.

