NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిడుతూర్ లో  ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

1 min read

మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండల తహసిల్దార్ కార్యాలయంలో  తహసిల్దార్ శ్రీనివాసులు మరియు సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా మిడుతూరు ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు భూపనపాడు సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎంపీడీవో దశరథ రామయ్య,తహసీల్దార్ శ్రీనివాసులు,ఎస్ఐ ఓబులేష్, ఏపీఎం సుబ్బయ్య హాజరయ్యారు.ముందుగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. చింతలపల్లిలో సహకార సొసైటీ చైర్మన్ ఆర్ వెంకటేశ్వర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.వీపనగండ్లలో మాల మహానాడు తాలూకా అధ్యక్షులు ఏసీ నాగేష్, అచ్చన్న,జైపాల్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.అదేవిధంగా మండలంలోని అన్ని పంచాయతీల్లో అధికారులు అంబేద్కర్ కు నివాళులు అర్పించారు.

About Author