NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంబరాన్నంటిన అంబేద్కర్ జయంతి వేడుకలు

1 min read

నివాళులు అర్పించిన ఎమ్మెల్యే,అధికారులు,ప్రజా, దళిత సంఘాలు

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. మంగళవారం జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలు పట్టణంలో కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రజా మరియు దళిత సంఘాల నాయకులు మాల మహానాడు,ఎమ్మార్పీఎస్ సిపిఐ ఎంఎల్,సిపిఎం,సిపిఐ ఉద్యోగులు భారీగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటాలను చేత పట్టుకొని డీజే సౌండ్ సిస్టం అంబేద్కర్ పాటలతో కేజీ రహదారి వెంట చక్కటి డాన్సులతో మెడలో కండువాలు ధరించి అంబేద్కర్ జయంతి వేడుకలను సంబరాలు చేసుకున్నారు.తర్వాత పాత బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించి జై భీమ్ జై భీమ్ అంటూ అదేవిధంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గురించి ఆయన సేవలను వారు కొనియాడారు. ముందుగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి, మండల కన్వీనర్ మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, మున్సిపాలిటీ సిబ్బంది మరియు నాయకులు మున్సిపాలిటీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా వివిధ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలోరూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, మాల మహానాడు నాయకులు నాగేష్,అచ్చన్న, శివప్రసాద్,వెంకటేష్,ఎమ్మార్పీఎస్ నాయకులు జాన్,గాంధీ మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *