NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి 

1 min read

ఎమ్మెల్యే శ్యాం కుమార్                             

న్యూస్ నేడు, పత్తికొండ : పాఠశాలల్లో విద్యార్థులకు  మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన పౌష్టికాహార భోజనం అందించాలని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మధ్యాహ్న భోజన నిర్వహణ సిబ్బందికి సూచించారు. బుధవారం స్థానిక పత్తికొండ పట్టణంలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈరోజు ఎంతమంది విద్యార్థినిలు పాఠశాలకు వచ్చారో, వారికి మెనూ ప్రకారమే భోజనం పెడుతున్నారా అని పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాల్లో కూడా పరిశుభ్రంగా ఉండేలా  చర్యలు తీసుకోవాలని హెడ్మాస్టర్ ను ఆదేశించారు. క్రమశిక్షణతో చదువుకోవడం, పాఠశాలలో ఉపాధ్యాయుల సూచనలు పాటించడం ద్వారా విజయాన్ని సాధించవచ్చని విద్యార్థులకు ఎమ్మెల్యే సూచించారు.ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలని కోరారు .ఉపాధ్యాయులు ఏ విధంగా పాఠాలు చెబుతున్నారు. భోజనం రుచిగానే పెడుతున్నారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా  అని ఎమ్మెల్యే విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం వంట గది వద్దకు వెళ్లి  మధ్యాహ్నం భోజనం నాణ్యత ఎలా ఉందో పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తిన్న ఎమ్మెల్యే  భోజనం రుచిగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం  రుచి, శుచి తో కూడిన మధ్యాహ్న భోజనం వడ్డించాలని పాఠశాల హెడ్మాస్టర్ ను ఆదేశించారు.

About Author