NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అగ్నిమాపకశాఖ కు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు

1 min read

విపత్తు నివారణలో అత్యంత అప్రమత్తతో ఉండాలి

జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: విపత్తు నివారణలో అత్యంత అప్రమత్తతో ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అగ్నిమాపక శాఖ అధికారులకు సూచించారు. అగ్నిమాపక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయలతో  కేటాయించిన ఆధునిక సౌకర్యాలతో కూడిన  3 వాహనాలను, బోట్లు,  డ్రాగన్ లైట్స్ వంటి ఆధునిక పరికరాలను   స్థానిక కలెక్టరేట్ ఆవరణలో బుధవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్ట నివారణలో రాష్ట్ర విపత్తు నివారణ దళం సేవలు ఎంతో ముఖ్యమైనవన్నారు. ఆ సమయంలో రాష్ట్ర విపత్తు నివారణ దళం అయిన అగ్నిమాపక శాఖ అధికారులు అత్యంత అప్రమత్తతో వ్యవహరించి నష్ట నివారణ చర్యలు తీసుకోవలసి ఉందన్నారు. అగ్నిమాపక శాఖ కు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమంలో భాగంగా 2 కోట్ల రూపాయల విలువైన 3 అధునాతన సౌకర్యాలతో కూడిన వాహనాలు, బోట్లు, డ్రాగన్ లైట్స్ వంటి ఆధునిక  పరికరాలను  రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిందన్నారు.  అగ్నిమాపక భద్రత  వారోత్సవాలను జిల్లాలో ఈనెల 14వ తేదీ నుండి  20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణకు, ప్రమాద సమయంలో తీసుకోవలసిన చర్యలపై అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి విపత్తు సమయంలో ప్రభుత్వం అందించిన ఆధునిక వాహనాలు, పరికరాల సహాయంతో వేగంగా స్పందించి  నష్ట నివారణకు  చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అగ్నిమాపక శాఖాధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక భద్రత చర్యలపై ముద్రించిన  కరపత్రం, పోస్టర్ ను జిల్లా కలెక్టర్  కె.వెట్రిసెల్వి విడుదల చేశారు.కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి రత్నబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

About Author