సిఐటియు జండా ఆవిష్కరణ
1 min read

న్యూస్ నేడు, పత్తికొండ : నంద్యాలలో జరిగే రాష్ట్ర మహాసభల సందర్భంగా సిఐటియు రాష్ట్ర పిలుపు మేరకు గురువారం పత్తికొండ పట్టణంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్న సిఐటియు కార్యాలయం ముందు సిఐటియు జండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రామాంజనేయులు అధ్యక్షతన వహించగా సిఐటియు మండల అధ్యక్షులు డి గోపాల్ జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర మాట్లాడుతూ, ఈనెల 17, 18, 19 తేదీల్లో నంద్యాల నందు సిఐటియు రాష్ట్ర మహాసభలో జరుగుతున్నాయని అందుకు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై విధించిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దుచేసి, 29 పాత చట్టాలను పునరుద్ధరించాలని ఆయన ఆరు డిమాండ్ చేశారు. కార్మికులు కర్షకులు కార్మిక ఉద్యమకారులు రాజ్యాధికారం చేపడితే తప్ప కార్మికులకు మంచి రోజులు రావని, బడుగు బలహీన వర్గాలు కార్మికులు, కర్షకులు, స్కీం వర్కర్లు ఈ ప్రభుత్వాలలో వెట్టిచాకిరికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో సిఐటియు బజార్ హమాలీలు మద్దయ్య నడిపి పులి అల్లి పీరా తదితరులు పాల్గొన్నారు.

