స్వీయ సెన్సస్ నమోదు చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)
1 min read

స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొని, జనగణన ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలనీ ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సెన్సెస్ 2027 కార్యక్రమంలో భాగంగా గురువారం స్వీయ గణన నమోదు కార్యక్రమాన్ని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ప్రారంభించారు. ఈనెల 16 నుండి 30వ తేదీ వరకు సెన్సెస్ పోర్టల్ నందు కుటుంబ యజమానులు వారి స్వీయ వివరములు భారత ప్రభుత్వ వెబ్సైట్ నందు నమోదు చేసుకొనుటకు ప్రజలందరికీ అవకాశం కల్పించడంతో సదరు కార్యక్రమం ప్రారంభంలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) https://se.census.gov.in పోర్టల్ ద్వారా తన కుటుంబం వివరాలను జనగణన స్వీయ నమోదు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ జగదంబ ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఏ .భాను ప్రతాప్ , ఏలూరు అర్బన్ తహసీల్దార్ గాయత్రి మరియు కలిసి ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి, స్వీయ నమోదు ప్రక్రియ గురించి వివరించి శాసన సభ్యుల కుటుంబ వివరాలు స్వీయ నమోదు ప్రక్రియ ద్వారా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే కి స్మారక చిహ్నం (మెమెంటో)ను అధికారులు అందజేశారు. ప్రజలందరూ ఈ స్వీయ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, జనగణన ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


