NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమావాస్య సందర్భంగా దేవరగట్టు లో విశేష పూజలు

1 min read

అభిషేకాలు, బిల్వ అర్చనలు, అన్నదానం – భక్తుల భక్తి ఉత్సాహం

హోళగుందన్యూస్ నేడు: అమావాస్య సందర్భంగా దేవరగట్టు ప్రాంతంలోని శ్రీ మళమాల్లేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారి దర్శనం పొందారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.శ్రీ మళమాల్లేశ్వర స్వామి వారికి అభిషేకం, బిల్వ అర్చన, బండారు అర్చనలను అర్చకులు గిరి స్వామి, మనోహర్ స్వామి నిర్వహించారు. అలాగే అమ్మవారికి కుంకుమ అర్చన, ఆకు పూజలను భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించారు.ఈ కార్యక్రమంలో చిన్నారులు కుంకుమ, బండారు అట్టిస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రసాదం పంపిణీ చేశారు.మొత్తంగా అమావాస్య సందర్భంగా దేవరగట్టు ప్రాంతం భక్తి పరవశంతో నిండిపోయి, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *