NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆటోనగర్ సమస్యలకు పరిష్కారం చూపిన హైకోర్టు తీర్పు

1 min read

ఆటోనగర్ అధ్యక్ష్య, కార్యదర్శులు అరుణతార నాగేశ్వరరావు,అడపా సత్యనారాయణ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఆటోనగర్ అసోసియేషన్ కార్యాలయం నందు నిర్వహించారు.ఈ సమావేశంలో పాల్గొన్న అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు మాట్లాడుతూ ది ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్  రి.నెం.83/1982, ఏలూరు అసోసియేషన్ కు సంబంధించిన ఆటోనగర్ భూములపై 2017 నవంబర్ లో ఏపీఐఐసీ వారు విధించిన రిజంప్షన్ ఆంక్షలు తొలగిస్తూ హైకోర్టు నందు దాఖలు చేసిన పిటిషన్ 3748/ 2017ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు 17.4.2025న ఏపీఐఐసీ వారి వాదనలను తిరస్కరిస్తూ, అసోసియేషన్ కు అనుకూలంగా తీర్పు  ఇచ్చారని తెలిపారు.సదరు అంశంపై ఏపీఐఐసీ వారు 2025 జూలై 9వ తేదీన హైకోర్టు నందు WA.804/2025 అప్పీల్ కు చేశారని సదరు అప్పీల్ అంశాలను పరిశీలించిన హైకోర్టు వారు 2025 డిసెంబర్ 16వ తేదీన దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఏపీఐఐసీ వారి వాదనలను  తిరస్కరించి అసోసియేషన్ కు అనుకూలంగా తీర్పు  ఇచ్చినట్లు తెలిపారు. సుమారు తొమ్మిది సంవత్సరములుగా ఆటోనగర్ నందు యూనిట్లు ఏర్పాటు చేసుకున్న సభ్యులు, యూనిట్లు ఏర్పాటు చేయవలసిన సభ్యులు ఏపీఐఐసీ వారి రిజంప్షన్ ఉత్తర్వులు వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ఆటోనగర్ సమస్యలకు పరిష్కారం లభించిందని ఆకాంక్షించారు.కార్యదర్శి అడపా సత్యనారాయణ మాట్లాడుతూ  ఎన్నికల సమయంలో మేమంతా అసోసియేషన్ సభ్యులకు ఆటోనగర్ రిజంప్షన్ తొలగించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చామని అందులో భాగంగా సిపిఐ పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ సహకారంతో భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) మాజీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు మమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  చంద్రబాబు నాయుడు దగ్గరికి, రాష్ట్ర రెవెన్యూ మంత్రి వర్యులు అనగాని సత్య ప్రసాద్ దగ్గరికి తీసుకువెళ్లి ఆటోనగర్లో యూనిట్లు ఏర్పాటు చేసుకున్న సభ్యులు పడుతున్న ఇబ్బందులను సవివరంగా తెలియజేశారని తెలిపారు.ఏపీఐఐసీ నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఉండి మాజీ ఎమ్మెల్యే  మంతెన రామరాజుని,పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ని కలిసి ఆటోనగర్  సమస్యలను విన్నవించి రిజంప్షన్ తొలగించాలని వినతిపత్రాలు ఇచ్చినట్లు తెలిపారు.ఈ అంశంలో అసోసియేషన్ వారికి  సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.అసోసియేషన్ సలహాదారు ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధిని,సభ్యుల సంక్షేమాన్ని దెబ్బతీయాలనే కుట్రతో పనిచేసే ప్రతి ఒక్కరికి చెంపపెట్టులా తీర్పు ఇచ్చిన గౌరవ హైకోర్టు వారికి హైకోర్టు అడ్వకేట్ శ్రీ భుజంగరావు కి,మాగంటి లక్ష్మణ్ కి,అసోసియేషన్ లీగల్ సలహాదారు అడ్వకేట్ దేవరకొండ వెంకటేశ్వర్లు (వెంకట్)కి, శ్రీనివాస శాస్త్రి కి, మేము చేసే ప్రతి పనికి మాపై ఎంతో నమ్మకం ఉంచి మమ్మల్ని ప్రోత్సహించిన మా కమిటీ సభ్యులకు, అసోసియేషన్ సభ్యులకు పేరుపేరునా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ హైకోర్టు తీర్పుపై అడ్వకేట్ ని సంప్రదించి తదుపరి కార్యాచరణ రూపొందించుకొని పనిచేస్తామని తెలిపారు. అనంతరం టపాసులు పేల్చి, మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. ఈ సమావేశంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్, అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్రి ఈశ్వరరావు, కమిటీ సభ్యులు, షేక్ జుల్ఫీ, సయ్యద్ చోటే, బుస్సే ప్రతాప్ కుమార్, మాజీ ఉపాధ్యక్షులు పల్లా అప్పారావు, లారీ మెకానిక్ బాబు, బోడ పెద్ద బుజ్జి,బొడ్డు సురేష్, శాయన అభిలాష్ కుమార్,కర్రి మహేశ్వర రావు కేబీ కార్ వర్క్స్ కాశి,రవి, షఫీ, కాలేషా,తాళ్లూరి బాబురావు, అంగులూరి రాంబాబు, లారీ మెకానిక్ అమీర్, ఉప్పులూరి కేశవరావు, మహబూబ్ షరీఫ్,పొన్న ధర్మరాజు,కె.వెంకటేష్, మావూరి శ్రీను,గ్రంధి నాగ రవి కిషోర్,కే.రమేష్, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *