NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎలినినో ప్రభావితం పై అవగాహన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కల్లూరు మండలము లోని పందిపాడు గ్రామం నందు  భూ మాతా సంరక్షణ కార్యక్రమము లో భాగంగా  రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఇందులో భాగంగా  డిఆర్​సి ఏడిఏ శ్రీమతి అరుణ ,  డిఆర్​సి ఏఓ శ్రీమతి నాగ సరోజమ్మ , మండల వ్యవసాయ అధికారి విష్ణు వర్ధన్ రెడ్డి కల్లూరు వారు పాల్గొనడం జరిగినది. ఎలినినో ప్రభావితం పై అవగాహన, పంట మార్పిడి, భూసార పరీక్షలు, రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువుల పై మొగ్గు చూపి భూసారాన్ని పెంచి అధిక లాభాలను పెంచుకోవాలని, పురుగు మందుల వాడకం తగ్గించి జీవామృతంతో  పిచికారి చేసి పెట్టుబడులు తగ్గించుకోవాలని  తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ  పెద్దలు మరియు  రైతులు పాల్గొనడం జరిగింది.

About Author