NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జి. పుల్లయ్య, నిర్మాణ్ (ఎన్జీవో) సంస్థల మధ్య అవగాహన ఒప్పందం 

1 min read

కర్నూలు ఎడ్యుకేషన్ , న్యూస్ నేడు :  కర్నూలులోని జి.పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు  స్వచ్ఛంద సంస్థ నిర్మాణ్ ఆర్గనైజేషన్ మధ్య విద్యార్థుల ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో  అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యాసంస్థల చైర్మన్ శ్రీ జీవీఎం మోహన్ కుమార్ గారు మరియు హరీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ నిర్మాణార్గనైజేషన్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు, మార్చుకున్న అనంతరం వారిరువురూ  ఈ భాగస్వామ్య ముఖ్యాంశాలు తెలియజేశారు.  ఇంపాక్ట్ హైరింగ్ కార్యక్రమాలు: ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్ అవకాశాలను నిర్మాణ్ పారిశ్రామిక నెట్‌వర్క్ ద్వారా కల్పించడం. సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్, రెజ్యూమె తయారీ, ఇంటర్వ్యూ శిక్షణ అందించడం.  నిర్మాణ్ స్టూడెంట్ చాప్టర్ ఏర్పాటు: GPCETలో నిర్మాణ్ స్టూడెంట్ చాప్టర్‌ను ప్రారంభించి, వర్క్‌షాప్‌లు, సామాజిక ప్రభావ ప్రాజెక్టులు, నాయకత్వ శిక్షణ ద్వారా విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచడం. కళాశాల తరఫున ఒక ఫ్యాకల్టీ కోఆర్డినేటర్‌ను నియమించడం.  నైపుణ్యాభివృద్ధి & సామర్థ్య పెంపు: సాంకేతిక, సాంకేతికేతర నైపుణ్యాలపై ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలు, పరిశ్రమ నిపుణులతో గెస్ట్ లెక్చర్లు, మెంటార్‌షిప్ కార్యక్రమాలు నిర్వహించడం.   అవుట్‌ రీచ్ & సమ్మిళిత అభివృద్ధి: మహిళా సాధికారత, లింగ సమానత్వం, సమాన అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు సమాన ప్రాతినిధ్యం కల్పించడం వంటివి చేపడతారని తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం గిరిధర్ కుమార్ విభాగాధిపతులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *