NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముద్దటమాగి గ్రామంలో భక్తి సందడి

1 min read

– గోపాలకృష్ణ స్వామి విగ్రహ ప్రతిష్ఠకు లక్ష రూపాయల విరాళం

సేవాభావం చాటిన టిడిపి నాయకులు ఈబీజీ గోవింద్ గౌడ్, ఈబీజీ రాజేంద్ర గౌడ్ – గ్రామస్తుల ప్రశంసలు

హోళగుందన్యూస్ నేడు: ముద్దటమాగి గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. గోపాలకృష్ణ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో, గ్రామంలోని గుడి నిర్మాణానికి టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్  మరియు యువనాయకుడు ఈబీజీ రాజేంద్ర గౌడ్  కలిసి రూ.1,00,011/- (ఒక లక్ష పదకొండు రూపాయలు) విరాళంగా అందించి తమ సేవాభావాన్ని చాటారు.ఈ విరాళం గ్రామంలో ప్రశంసనీయంగా మారింది. స్వామి వారి సేవలో భాగంగా అందించిన ఈ సహాయం పట్ల గ్రామస్తులు ఇద్దరు నాయకులను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఈబీజీ గోవింద్ గౌడ్ , “శ్రీ గోపాలకృష్ణ స్వామి గుడి నిర్మాణం మన అందరి భక్తి, బాధ్యతల ప్రతీక. గ్రామస్తులంతా ఐక్యంగా ముందుకు వస్తే గుడి నిర్మాణం త్వరగా పూర్తి అవుతుంది” అని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుండి సహాయం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.అదేవిధంగా, ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న శ్రీ గోపాలకృష్ణ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి గ్రామస్తులు ఈబీజీ గోవింద్ గౌడ్ ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పంపాపతి , యారిస్వామి , ధిడి మలయ్యా , టిడిపి మండల అధ్యక్షుడు ముల్ల మోయిన్ , రామాంజీ, రంగ , జనసేన నాయకుడు వెంకటేష్ , పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.గ్రామంలో భక్తి ఉత్సాహం నడుమ జరగనున్న ఈ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం విజయవంతం కావాలని అందరూ ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *