NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

23 వరకు’పోషణ పక్వాడ’ కార్యక్రమాలు

1 min read

చిన్నారులకు సెల్ ఫోన్ దూరంగా ఉంచాలి

మిడుతూరు న్యూస్ నేడు: ఈనెల 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ‘పోశణ పక్వాడ’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అంగన్వాడి సూపర్వైజర్లు వరలక్ష్మి,రేణుకా దేవి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో శనివారం ఉప్పలదడియ, జలకనూరు గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు సూపర్వైజర్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో 23వ తేదీ వరకు చిన్నారుల తల్లిదండ్రులకు వివిధ రకాల వాటిపై అవగాహన కల్పిస్తున్నట్లు అదేవిధంగా చిన్నారులకు మొబైల్ ఫోన్లు ఇవ్వడం వల్ల కలిగే నష్టాలు కంటి చూపు దెబ్బ తినడం నిద్ర లేకపోవడం తదితర వంటివి చిన్నారులకు నష్టం కలిగిస్తాయని వాటి వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుందనే వాటి గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వీటితోపాటు పిల్లలకు ఇంటిలో తయారు చేసే ఆహారమే పెట్టాలని  అంగళ్లలో ఉండే వాటిని పిల్లలకి ఇస్తే వారే ఆరోగ్యం దెబ్బ తినటం వల్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని చిన్నారుల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమాలకు తల్లిదండ్రులు హాజరై కార్యక్రమాలను సద్విని చేసుకోవాలని సూపర్వైజర్లు తెలిపారు.

About Author