NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా హోళగుందలో బసవ జయంతి వేడుకలు

1 min read

– కనక శ్రీ యూత్ ఆధ్వర్యంలో నూతన విగ్రహానికి పూలమాల

సమానత్వ సందేశం అందించిన బసవన్న – యువత చైతన్యవంతులు కావాలని పిలుపు

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండల కేంద్రంలో శ్రీ బసవ జయంతి సందర్భంగా కనక శ్రీ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నూతనంగా ప్రతిష్టించిన శ్రీ బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కనక శ్రీ యూత్ నాయకుడు యస్.కె. గిరి మాట్లాడుతూ, బసవన్న బోధనలు సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. “బసవన్న చెప్పినట్లు సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమే. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్న భావన లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి. మూఢనమ్మకాల నుంచి బయటపడి ప్రతి వ్యక్తి చైతన్యవంతుడు కావాలి. జ్ఞానం వైపు ప్రజలను నడిపించడం మనందరి బాధ్యత” అని అన్నారు.ఈ కార్యక్రమంలో కనక శ్రీ యూత్ నాయకులు మంజునాథ్ గౌడ్, బీరప్ప స్వామి, చితానంద, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *