NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బడి పిలుస్తోంది కార్యక్రమం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్యాపిలి మండలంలోని పోతుదోడ్డి గ్రామంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. చక్రే నాయక్  ప్రభుత్వం పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాల గురించి పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఉపాధ్యాయులు చేస్తున్న కృత్యాధార బోధన గురించి అన్ని విషయాలను  విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. తల్లిదండ్రులు స్పందించి 06 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించారని వారు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు  అస్మా బేగం, శాంతి ప్రియ,పక్కిరమ్మ ఇబ్రహీం సాహెబ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *