NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  త్వరగా కోలుకోవాలి

1 min read

జనసేన పార్టీ కౌతాళం మండల జనసైనికులు

కౌతాళం న్యూస్ నేడు : మండల పరిధిలో గల ఉరుకుంద దేవస్థానం లో  జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో తిరిగి పాల్గొనాలని ఆకాంక్షిస్తూ, జనసేన పార్టీ కౌతాళం మండల నాయకులు  రాంబాబు ఆధ్వర్యంలో ఉరుకుంద గ్రామంలోని శ్రీ శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న గొప్ప నాయకుడని  తెలిపారు. వ్యక్తిగత సౌకర్యాలను పక్కనబెట్టి ప్రజల సేవకై అంకితభావంతో పనిచేస్తున్న ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు,స్వామి దాస్ , చిన్న ,దేవదాస్, లాస్కర్ రాజు,బాధినేహాల్ జనసేన నాయకులు సాయిబాన్న, అంజి, రాజు, అలంభాష, రౌడూర్ జనసేన నాయకులు మహమ్మద్, కామవరం జనసేన నాయకులు అబ్దుల్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *