NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్షయ తృతీయ సందర్భంగా మజ్జిగ పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: మానవ సేవయే మాధవ సేవ అంటూ డోన్ పట్టణ పరిసర ప్రాంతాల్లో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలను అందుకుంటున్న స్ఫూర్తి సేవా సమితి వారు సోమవారం నాడు అక్షయ తృతీయ సందర్బంగా డోన్ ఆర్టీసీ బస్టాండ్ నందు డిపో మేనేజర్ చలపతి రావు సహకారంతో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. అదేవిధంగా అమెరికాలి స్థిరపడ్డ స్ఫూర్తి శ్రేయోభిలాషులు తిరువీధి క్రిష్ణ సుమంత్ తిరువీధి సాయిలక్ష్మి దంపతుల సహకారంతో స్థానిక బేతంచెర్ల సర్కిల్ నందు మజ్జిగ పంపిణీ, పాత బస్టాండ్ సర్కిల్ నంద్యాల అన్నదానం చేశారు. అనంతరం కర్నూలుకి చెందిన స్ఫూర్తి దాతలు సిరిగుప్ప శ్రీధర్ బాబు సిరిగుప్ప శాంతి దంపతుల సహకారంతో డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించారు. అక్షయ తృతీయ రోజున రెండు చోట్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు, రెండు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వందలాది మంది ప్రజలకు చల్లని మజ్జిగతో దాహర్తిని, వందలాది ప్రజలకు ఆహారం అందించి వారి ఆకలిని తీర్చామని అందుకు సహకారం అందించిన దాతలకు సంస్థ తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు స్ఫూర్తి మధు అన్నారు. ఈ కార్యక్రమంలో డోన్ ఆర్టీసీ డిపో మేనేజర్ చలపతి రావు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, దాతలు తిరువీధి రవీంద్రనాథ్, తెజేశ్వర గుప్తా, సుదర్శన్ రెడ్డి, స్ఫూర్తి సభ్యులు స్ఫూర్తి మధు, భాస్కర్, మోహన్ రెడ్డి, నారాయణ స్వామి, వసంత్, సెల్ హుసేన్, మహమ్మద్, శివయ్య, భాస్కర్ నాయుడు, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *