NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదలకు వరం..ముఖ్యమంత్రి సహాయ నిధి

1 min read

-6,79,424 రూ.ల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చరితారెడ్డి..

ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్​ నేడు  :ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు. సోమవారం కర్నూలులో ఎమ్మెల్యే స్వగృహంలో పాణ్యం నియోజకవర్గానికి చెందిన 12 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కలను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

సీఎంఆర్ఎఫ్ అందుకున్న వారిలో లబ్దిదారుల వివరాలు:

షేక్ జునేద్ (చైల్డ్)-26,314,

బోయినీ సువర్ణ-45 వేలు,

ఎర్రన్న గారి వెంకటేశ్వరమ్మ 20వేలు,

బైసానీ శ్రీనివాసులు 38,600,

చాకలి ఎల్లమ్మ-30,786,

ఉప్పరి వెంకటేశ్-3,02,270,

కళ్ళపారి ఉపేంద్ర(డెత్) 92,241,

షేక్ ఖాజా హుస్సేన్- (డెత్)44,350,

మనోజ్ (చైల్డ్) 55,300,

జింకల లక్ష్మీదేవి 25వేలు,

నంద్యాల మల్లికార్జున (డెత్)-3 లక్షలు,

షేక్ హుస్సేన్ భాష-36,377 రూ.లు మంజూరు అయ్యాయని వీరందరికీ చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.వివిధ రోగాలతో బాధపడుతున్న వారందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి వచ్చే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

About Author