NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

23 మందికి ఘన సన్మానం…

1 min read

కర్నూలు, న్యూస్ నేడు : కోడుమూరు నియోజకవర్గం  పసుపుల గ్రామపంచాయతీలో జరిగిన ‘నమస్తే’కార్యక్రమం లో భాగంగా గ్రామపంచాయతీలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమతి బొగ్గుల శీలమ్మ , ఇంచార్జి ఎంపీడీఓ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి , పంచాయతీ కార్యదర్శి శ్రీ వై. హేమంత కుమార్ రెడ్డి , ఎంసీఓ  శ్రీ వేణు , సచివాలయం సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపిడిఓ  మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులందరూ నమస్తే యాప్ లో నమోదు చేసుకోవాలని, భూగర్భ డ్రైనేజీల్లో పనిచేసే వారికి అన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాతనే భూగర్భ డ్రైనేజీల్లో పనులు చేయవలెనని,వారికి కావలసిన అన్ని రకముల సామాగ్రిని సమకూర్చుకున్న తర్వాతనే భూగర్భ డ్రైనేజీల్లో పనులు చేయవలెనని తెలియజేశారు.

About Author