NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుమ్మునూరు గ్రామంలో ఆత్మీయ పర్యటన…

1 min read

నవదంపతులకు ఆశీస్సులు అందించిన ఆలూరు టీడీపీ ఇంచార్జ్  వైకుంఠం జ్యోతి

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్  వైకుంఠం జ్యోతి గుమ్మునూరు గ్రామంలో ఆత్మీయంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నూతన వధూవరులను వారి నివాసానికి వెళ్లి కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.నవదంపతులు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలతో నిండిన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ తన హృదయపూర్వక ఆశీస్సులు అందించారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి క్షేమసమాచారాన్ని తెలుసుకున్నారు.ప్రజలతో నిరంతరం ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగిస్తూ, ప్రతి కుటుంబంలోని శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల ప్రేమాభిమానాలను పొందుతున్న శ్రీమతి వైకుంఠం జ్యోతి సేవాభావం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

About Author