NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అభిషేకలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: అరుద్ర నక్షత్రం, స్వామివారి జన్మనక్షత్రం మరియు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని  సోమవారం ప్యాపిలి పట్టణంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయగా, భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని భక్తులతో కిక్కిరిసిపోయింది.

About Author