కీటక జనిత వ్యాధులపై పునః చరణ శిక్షణ కార్యక్రమం
1 min read
పల్లెవెలుగు కర్నూలు: కర్నూలు వైద్య కళాశాల మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి శాంతి కళ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మరియు పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు మలేరియా డెంగు చికెన్ గునియా మొదలగు కీటక జనిత వ్యాధులపై పునః చరణ శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యం మరియు ఆరోగ్య శాఖ అధికారి గారు మాట్లాడుతూ మన జిల్లా నందు పట్టణ ఆరోగ్య కేంద్రాల నందు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డెంగ్యూ కేసులు ఎక్కువగా వస్తున్నవని ఆ ప్రాంతాల ప్రజలలో అవగాహన కార్యక్రమాలు మరియు ఆరోగ్య విద్య బోధన చేయాలని వారి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని కీటక జనిత వ్యాధు లు ప్రబలకుండా చూసుకోవాలని మరియు దోమలు నివసించు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు కీటకాల వలన అరికట్టాలని వైద్యులు విద్యాబోధన వారి సిబ్బందితో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు మరియు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఇవ్వడానికి డాక్టర్ బ్లేస్సి మోహన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కర్నూలు మెడికల్ కాలేజీ నుంచి వచ్చి మలేరియా గురించి విపులంగా వివరించారు మరియు డాక్టర్ డి శ్రీనివాసులు అసిస్టెంట్ ప్రొఫెసర్ కర్నూలు మెడికల్ కాలేజీ వారు డింగు గురించి పిపిటి ద్వారా విపులంగా వివరించినారు ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి నూకరాజు డెమో శ్రీనివాసులు ఆరోగ్య విద్యా బోధకురాలు పద్మావతి ఏ ఎం ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.