జనాభా నిష్పత్తి ప్రకారం.. బీసీలకు రాజ్యాధికారంలో భాగం ఇవ్వాలి
1 min read– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెబుతాం
– వై.నాగేశ్వరరావు యాదవ్ జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తిరుపతి రూరల్,పద్మావతి గార్డెన్,పెరుమాళ్ళపల్లి లో బీసీ ల వెనుకబాటు తనాన్ని,బీసీలకు రాజ్యాధికారంలో భాగం కావాలని కోరుతూ జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ బాబు ఆధ్వర్యంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్ , రాష్ట్ర కన్వీనర్ ఆవుల నరసింహారావు గారు, నంద్యాల జిల్లా నాయకులు గుర్రప్ప , చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాధం గారు, ప్రచార కార్యదర్శి రాజబాబు గారు,,నరేష్ గారు, స్టూడెంట్ నాయకులు వెంకట్,ప్రచారకార్యదర్శి రెడ్డప్ప గారు, సులూరుపేట నియోజకవర్గంలో అధ్యక్షులు కిషోర్ గారు,సురేష్ గారు,రమణయ్య గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు బీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా వై.నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ:స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న బీసీలను వెనుకబడి వున్నారు. బీసీల అభివృద్ధి ని గుర్తించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. 56శాతం నుండి 60 శాతం వరకు బీసీలమే ఉన్నాం. ఈ దేశానికి అన్ని వృత్తుల ద్వారా బీసీలే అత్యధిక సంపదను సృస్టిస్తున్నాము. బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వృత్తులపరంగా అన్నిటిలోనూ వెనకబడి ఉన్నారు కానీ ప్రస్తుత అధికార పార్టీలు ఏమాత్రం బీసీలను పట్టించుకోవటం లేదు.బీసీల ఓట్లతో గద్దనికి బీసీలను చిన్నచూపు చూస్తున్న రాజకీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి.బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాధికారంలో భాగం కావాలి.బాగం ఇవ్వక పోతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా ఓటు హక్కు తో బుద్ధి చెబుతాం .పెద్ద పెద్ద అధికారాలు,విలువున్న అధికారాలు అగ్రవర్ణాలాక.బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి.జనాభాను లెక్కించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి.స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లలో 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించి బీసీలను అనేక పదవులకు దూరం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం.కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో టిటిడి చైర్మన్ పదవిని బీసీలకు బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.బీసీల చైతన్యం పరుస్తూ గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఉద్యమాలను చేపడుతున్నాము.