డిజిటల్ అసిస్టెంట్ ను దూషించిన ఉద్యోగి పై చర్యలు తీసుకోవాలి..
1 min readపల్లెవెలుగు వెబ్, గడివేముల: పశ్చిమగోదావరి జిల్లా సామర్లకోట మండలం నగర పంచాయతీ కార్యదర్శి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ ను లాగిన్ విషయంలో అసభ్యకరంగా మాట్లాడిన పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ అసిస్టెంట్ లు డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. అందులో భాగంగా సోమవారం గడివేముల మండలంలోని ఎంపిడిఓ విజయసింహారెడ్డి కి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ లు వినతి పత్రం అందజేశారు . డిజిటల్ అసిస్టెంట్ లు మాట్లాడుతూ అసలే పని భారం ఎక్కువగా ఉన్నా ఇతర ఉద్యోగుల విధులు నిర్వహించాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని, ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. గ్రామ సచివాలయ వ్యవస్థ వెన్నెముక అయినా తమను భయబ్రాంతులకు గురి చేయడం, సెలవు రోజుల్లో పని చేయమని ఒత్తిడి చేయడం సమంజసం కాదన్నారు. నిరసన కార్యక్రమంలో పవన్ కుమార్. నవీన్. మురళి కృష్ణ . రాజ్ శైలేష్. సాయి తేజ. రామ మద్దిలేటి. రాజేశ్వరి. లీలావతి. పాల్గొన్నారు.