పురాణాలన్నీ విజ్ఞాన రహస్యాలే
1 min read
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే.
వేముగోడులో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ నేడు: భారతీయ పురాణాలలో ఎంతో లోతైన విజ్ఞానం, తత్వం, ప్రకృతి పరిశీలన, జీవన విధానం దాగి ఉన్నదని, శ్రీమద్రామాయణం, మహాభారతం, భాగవత పురాణం వంటి గ్రంథాల్లో కేవలం భక్తి మాత్రమే కాకుండా ఖగోళ శాస్త్రం, వైద్యం, నైతికత, మనోవిజ్ఞానం, సమాజ నిర్మాణం వంటి అంశాలూ ఎన్నెన్నో కనిపిస్తాయని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు గుమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్య నిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి అన్నారు. గోనెగండ్ల మండలం, వేముగోడు గ్రామంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంనందు నాలుగు రోజుల ధార్మిక కార్యక్రమాల సందర్బంగా వారు ప్రవచించారు. తదనంతరం స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భజన మండలి అధ్యక్షులు యాగంటి ఈశ్వరరెడ్డి, హార్మోనిష్ఠు జి. ఈరన్న, డక్కీ మాష్టారు ఎ. వీరన్న, తబలిష్ఠు కె. అర్జున్, వై.రాజారెడ్డి, బి. చిన్నయ్య, రంగన్న, ఎ. వినోద్, మద్దిలేటి, సి. ఉరుకుందు, యం. లక్ష్మణ్ణ, జి.రామాంజనేయులు, రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.


