NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదేశాల అమలు లో వేగం అభివృద్ధిలో అన్నమయ్య కు అగ్రస్థానం

1 min read

కలెక్టర్ నిశాంత్ కుమార్ సమీక్ష

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : ఇటీవల రాష్ట్ర సచి వాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలు, సూచ నలను జిల్లాలో సమర్థ వంతంగా అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించా లని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదే శించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ హాలులో జిల్లా అధికారుల తో నిర్వహించిన సమీక్ష సమావేశం లో ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశం లో శాఖల వారీగా చర్చించిన అంశాలు, ముఖ్య మంత్రి నిర్దేశించిన కార్యాచరణ, ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, సాధించిన పురో గతిపై కలెక్టర్ సమీక్షించారు.

కలెక్టర్ల సమావేశం డే–1, డే–2లో శాఖల వారీగా ఇచ్చిన ఆదేశాల అమలులో ప్రస్తుత పరిస్థితి, ఎదుర వుతున్న సమస్య లు, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి శాఖకు సంబంధించిన యాక్షన్ పాయింట్ల ను నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని, క్షేత్రస్థాయి లో పర్య వేక్షణ పెంచి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల ఫలాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లా లో మంత్లీ ఎకనామిక్ రిపోర్టు లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం, అలాగే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లో జిల్లా పనితీరు గణనీ యంగా మెరుగుపడటంతో పాటు నాన్-కీ లో రాష్ట్రం లోని టాప్–4 జిల్లాల్లో స్థానం సాధించడం పట్ల కలెక్టర్ నిశాంత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా పనితీరులో ఈ మార్పు అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేస్తున్న కృషికి నిదర్శనమని కలెక్టర్ అధికారులను అభినందిం చారు.అన్నమయ్య జిల్లాను అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక ప్రగతి తదితర అన్ని రంగాల్లో మరింత ముందంజలో నిలిపేందుకు ఇదే స్ఫూర్తితో పనిచే యాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ల సమావేశం లో ఇచ్చిన ఆదేశాల అమలుపై శాఖల వారీగా నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ, నిర్దేశించిన లక్ష్యాల ను సాధించే దిశగా సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు.అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా నిశాంత్ కుమార్ బాధ్యతలు స్వీకరించి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో అధికా రులు, సిబ్బంది అందిస్తున్న సహకారాన్ని కలెక్టర్ అభినందిస్తూ, ఇదే సమన్వయం, అంకిత భావంతో జిల్లాను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, డిఆర్ఓ వెంకటేష్, ఆర్డీవోలు శ్రీనివాస్,  విజయ లక్ష్మి, ఎస్డీసీలు చంద్రశేఖర్ రెడ్డి, మాధవ కృష్ణారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *