పి ఆర్.సి కమిషన్ వేసి 30% మధ్యంతర భృతి చెల్లించాలి.. ఏపీ యుఎస్ డిమాండ్
1 min read

ఒంగోలు, న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రకాశం జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశం స్థానిక ఆంధ్ర కేసరి విద్యా కేంద్రం అందు జిల్లా అధ్యక్షులు కే మల్లికార్జున్ రావు అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతన సవరణ సంఘం నియమిస్తూ 30% I.R ప్రకటించాలని కోరారు 2023 జూలై నాటికి పిఆర్సి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నేటికీ కమిషన్ వేయకపోవడం మధ్యంతర భృతి చెల్లించకపోవడం నాలుగు డి.ఏలు పెండింగ్ ఉండటం పట్ల ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదనను వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర సంఘటన కార్యదర్శి సి.హెచ్. శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నుండి మినహాయింపు ఇప్పించడానికి ఏ బి ఆర్ ఎస్ ఎం ద్వారా (జాతీయ ఉపాద్యాయ సంఘం) కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని తప్పనిసరిగా మినహాయింపు లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేస్ విషయంలో ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క విధంగా ప్రకటిస్తుందని ఆప్షనల్ సెలవులు గతంలో మాదిరిగా పాఠశాల వారీగా విద్యార్థులకు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరగాలని, ఎటువంటి పోస్టులను బ్లాక్ చేయరాదని రాబోవు డీఎస్సీ ద్వారా ఖాళీలన్నీ నింపాలని కోరారు.జిల్లా ప్రధాన కార్యదర్శి టి. దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల 100 రోజుల యాక్షన్ ప్లాన్ విద్యార్థులలో ,ఉపాధ్యాయులలో తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తున్నారు ప్రతిరోజు పరీక్ష అనేది విద్యార్థులకు చాలా కష్టతరంగా ఉందని అన్నారు.సోషల్ మీడియాలో ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు వ్యవహరిస్తున్న విషయాలను స్క్రోల్ చేస్తూ ఉండడం శ్రేయస్కరం కాదని తెలిపారు.సమావేశానికి హాజరైన ఉపాధ్యాయ సంఘం బాధ్యులు అనేక విషయాలు చర్చించి, ప్రభుత్వం ఆర్థిక బకాయిల పట్ల ఉదాసీనతతో వ్యవహరించడం వేదనకు గురి చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా బాధ్యులు జిల్లా బాధ్యులు కే శ్రీనివాసరావు కె వెంకట్ రెడ్డి డి శేషగిరిరావు ఎంఎంఎస్ ఆంజనేయులు టి. శేషారావు మండల బాధ్యులు & ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

