ఏపీఎండీసీ కార్మికులును రెగ్యులర్ చేయాలి – సిఐటియు
1 min readపల్లెవెలుగువెబ్ కడప: ఏపీఎండీసీ కార్మికులను రెగ్యులర్ చేయాలని సీఐటీయూ నాయకులు ఏపీఎండీసీ చైర్మన్ సమీం ఆస్లాంకు విన్నవించారు. ఈమేరకు ఆమె కడప జిల్లా మంగంపేటకు వచ్చిన సందర్భంగా సీఐటీయూ అనుబంధ ఏపిఎండీసీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్ల యూనియన్ గౌరవాధ్యక్షులు సీహెచ్.చంద్రశేఖర్ తదితరులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సదరు కార్మికులు 12ఏళ్లుగా అవుట్ సోర్స్, శిక్షణ పేరుతో తక్కువ వేతనానికి పనిచేస్తున్నారని, వారికి సమాన వేతన ప్రాతిపదికన కనీస వేతనంతోపాటు రెగ్యులర్ చేయాలని చైర్మన్‌ను కోరారు. సీఎం జగన్ ఎన్నికల ముందు పాదయాత్రలోనూ కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. మంగంపేట పునరావాస ఉద్యోగులు సంస్థ అభివృద్దికి భూములు ఇచ్చి సహకరించారని, ప్రస్తుతం ఖాళీలగా ఉన్న పోస్టుల్లో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నవించారు. ఏపీఎండీసీ కార్మికులను యాజమాన్యం విభజించి పాలిస్తోందని, ట్రైనీ కార్మికులకు నేరుగా వేతనాలు ఇస్తున్నారని, అవుట్సోర్సింగ్కార్మికులకు సైతం ఏపీఎండీసీ ద్వారా వేతనాలు చెల్లించాలని, కమిషన్ ఏజెన్సీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాఫిట్ షేర్ 2ఏళ్లుగా ఇవ్వడం లేదని, మైనింగ్ లో ఫోర్మెన్లు, అసిస్టెంట్ మేనేజర్లు మైనింగ్ చట్టప్రకారం, రెగ్యులర్ ఉద్యోగులుతోనే పని చేయాల్సి ఉండగా, ఆ పని చేయలేదని అన్నారు. గతంలో పడగొటిటన వే బ్రిడ్జ్ క్వార్టర్స్ ను తక్షణమే నిర్మించాలని, డస్ట్ అలవెన్స్, వాషింగ్ అలవెన్స్ ధరలకు అనుగుణంగా పెంచాలని, సమాన మెడిక్లెయిమ్స్ ఇవ్వాలని, ఓ పి రూ.20 వేలకు పెంచాలని, అవుట్ సోర్సింగ్ వారికి కూడా వర్తింప చేయాలని, కార్మికులు మరణిస్తే దహన సంస్కారాలకు రూ.20 వేలకు ఇవ్వాలని, కుటుంబ సభ్యులు కూడా వర్తింప చేయాలని వివరించారు. అవుట్ సోర్స్ కార్మికులు మరణించిన వారి కుటుంబంలో, ఒకరికి ఉద్యోగం కల్పించాలని, వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, ఏఎల్ సి అగ్రిమెంట్ ప్రకారం తక్షణం లైబ్రరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 200 మిల్లులు 30 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించే బెరైటీస్ మిల్లులు, మూతపడి ఉన్నాయని, వారికి సబ్సిడీతో కూడిన రాయి సరఫరా చేయాలని, క్రసింగ్ఆర్డర్, మిల్లులకు ఇవ్వాలని, ముడి సరుకు నేరుగాఎగుమతులను నిషేధించాలని, పౌడర్ మాత్రమే సరఫరా చేయాలని బోర్డు లో ఈ విషయం చర్చించాలని ఆమె దృష్టికి తెచ్చారు. ఏపీ ఎం డి సి హాస్పిటల్లో మందుల కొరత ఉన్నాయని, అక్కడ పనిచేసే సిబ్బందిని కాంట్రాక్టు నుండి ఏపీఎండీసీకి మార్చాలని కోరారు. ఇందుకు స్పందించిన చైర్మన్ సమీమ్ ఆస్లాం ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, ప్రాజెక్టు జనరల్ మేనేజర్ శ్రీ రమణ గారు, హెచ్ ఆర్ డి, నారాయణ రెడ్డి గారు,మరియు, యూనియన్ అధ్యక్షులు కుప్పాల సుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి నారద సుబ్బరాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మరి శంకరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ జి వెంకటేష్, జాయింట్ సెక్రెటరీ, చిన్నయ్య, లక్ష్మీనారాయణ, సురేఖ, తదితరులు పాల్గొన్నారు.