కర్నూలులో… ఇన్వెంటరీ మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి
1 min read– ఫిబ్రవరి నెల 1వ తేదీ 3 గంటల లోగా దరఖాస్తు చేసుకోండి
- జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ఇన్వెంటరీ మేనేజర్ ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి నెల 1వ తేదీ 3 గంటల లోగా దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కార్యాలయం నందు ఒప్పంద ప్రాతిపదికన ఇన్వెంటరీ మేనేజర్ ఉద్యోగం భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, ఈ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనల్లో జాయింట్ కలెక్టర్ కోరారు.
వివరాలు :
పోస్టు : ఇన్వెంటరీ మేనేజర్
పదవీకాలం : కాంట్రాక్ట్ బేసిక్ మీద ఒక సంవత్సర కాలం.
పే స్కేల్ : రూ.20,000 నుంచి రూ.23,000 వరకు
అర్హతలు : 1)ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత
2)ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, ఇన్వెంటరీ సాఫ్ట్‌వేర్ తదితర కంప్యూటర్ అప్లికేషన్స్ ల యందు ఉత్తీర్ణత.
3)హార్డ్‌వేర్ పరికరాల వాడకంలో నైపుణ్యం ఉండాలి.
4)సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక.
దరఖాస్తుకు చివరితేదీ : ఫిబ్రవరి 1, 2022.
అధికారిక వెబ్సైట్ : [email protected]
[email protected]
[email protected]
Okey sir