NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజయవంతంగా ముగిసిన ఆర్చరీ ఛాంపియన్‌షిప్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జ్ఞాని ఆర్చరీ అకాడమీ ఈరోజు ఆదర్శ విద్యా మందిర్ హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ఆర్చరీ ఛాంపియన్షిప్ నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి దాదాపు 50 నుంచి 60 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదర్శ విద్యా మందిర్ హై స్కూల్ డైరెక్టర్ డాక్టర్ హరికిషన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, గెలుపు–ఓటములు సహజమే, కానీ క్రీడాస్ఫూర్తి మరియు క్రమశిక్షణే నిజమైన విజయం అని తెలిపారు. క్రీడాకారులు క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా బలంగా ఎదగాలని సూచించారు.పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు డాక్టర్ హరికిషన్ చేతుల మీదుగా మెడల్స్ మరియు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలోఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్. వేణుగోపాల్ రెడ్డి,ఆర్చరీ కోచ్ ఎం. భరత్ కుమార్, వజ్ర రాజు, జాయింట్ సెక్రటరీ శ్రీరాములు,వ్యాయామ ఉపాధ్యాయుడు మౌలాలి,మరియు క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ యువ క్రీడాకారుల్లో క్రీడాపట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు.

About Author