NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏకాగ్రత, సాధన తొనే క్రీడాకారులు రాణించాలి

1 min read

డా. వాసు రెడ్డి

కర్నూలు స్పోర్ట్స్ న్యూస్​ నేడు: విద్యార్థులు ఏకాగ్రతతో సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అని డాక్టర్ వాసు రెడ్డి అన్నారు. ఆదివారం కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలను జిల్లా క్రీడల అధికారి భూపతిరావు అతిధులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డా వాసురెడ్డి మాట్లాడుతూ ప్రాచీన క్రీడల్లో ఒకటైన విల్లు విద్యను క్రీడాకారులు సాధన చేయడం స్ఫూర్తిదాయకమన్నారు. ఏకాగ్రతతో సాధన చేస్తే సాధించలేనిది అంటూ ఏదీ లేదని అన్నారు. అనంతరం జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు మాట్లాడుతూ శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా క్రీడాకారుల దాగివున్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఆర్చరీ  సంఘం పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య, జాతీయ ఆర్చరీ కోచ్ వంశీకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు సుభాని, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *