NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండండి

1 min read

జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా

కర్నూలు , న్యూస్​ నేడు : వాతావరణ శాఖ సూచనల ప్రకారం  నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన సందర్భంగా రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల శాఖల అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తెలియజేస్తూ నష్టం కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిధిలావస్థలో  ఉన్న గోడలు, భవనాల వద్ద నిలిచి ఉండరాదని కలెక్టర్ ప్రజలకు సూచించారు.. అలాగే  నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న చోట వాగులు, ఏరులు దాటరాదని కలెక్టర్ సూచించారు.

About Author