ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకున్న అవకాశాలపై అవగాహన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: విద్యార్థుల్లో సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో జాతీయ సేవాపథకం (NSS) కీలకపాత్ర పోషిస్తుందని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి వర్సిటీ సెనేట్ హాలులో నిర్వహించిన ప్రోగ్రాంఆఫీసర్ల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతి ప్రోగ్రాం ఆఫీసర్ తమ కాలేజీలతోపాటు, దత్తత గ్రామాల్లో సేవాకార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి టి. ఐసయ్య మై భారత్ పోర్టల్లో యువ వాలంటీర్ నమోదు, యువతకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, యువజన భాగస్వామ్యం, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లకున్న అవకాశాలపై అవగాహన కల్పించారు. అలాగే పీఎఫ్‌ఎంఎస్ నిపుణులు ప్రేమ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (PFMS) వినియోగం, నిధుల నిర్వహణ, ఆన్‌లైన్ ప్రక్రియలపై శిక్షణ అందించారు. విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమ సమన్వయకర్త డా. బి. కవిత, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డా. కె.వి. రత్నం, బి.వి. శివప్రసాద్ రెడ్డి, డా. ఎస్.నాగచంద్రుడు, డా. విజయుడు సమన్వయం చేశారు.

