NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం.. మంత్రి టీజీ భరత్ గుప్తా

1 min read

కర్నూలులో 14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి టీజీ భరత్

కర్నూలు, న్యూస్​ నేడు:  సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలను ఆదుకుంటున్నామ‌ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ గుప్తా చెప్పారు. క‌ర్నూలు న‌గ‌రంలోని ఆయ‌న కార్యాల‌యంలో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 14 మందికి ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి ద్వారా మంజూరైన‌ చెక్కులు ఆయన పంపిణీ చేశారు. షేక్ అబ్దుల్ ఖాదర్ కు రూ.1,78,738, షేక్ గౌస్ భాషా కు రూ.25,000, బలిజ నాగరాజు కు రూ. 40,530, వెంకటేశ్వరి కి రూ.67,392, నాగ సౌమ్య రెడ్డి కి రూ.27,960, రంజిత్ రాజ్ కుమార్ కు రూ.47,584, మాధవస్వామి కి రూ.1,00,509, మోక్షిత కు రూ.15,541, విజయలక్ష్మి కి రూ.49,258, విష్ణు మూర్తి నాయుడు కు రూ.30,000, సాయి రామ్ కు రూ.35,000, కార్తీక్ వర్మ కు రూ.51,000, భాగ్య లక్ష్మీ కి రూ.25,603, దేవానందం కు రూ.7,00,000 ల చెక్కులు అందించారు. ప్రతి ఒక్కరితో మాట్లాడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం రూ.13,94,115 ల చెక్కులు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా తమ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.

About Author