NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్.సి.సి.క్యాడెట్‌ లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

1 min read

ప్రమాదం జరిగిన మొదటి గంట గోల్డెన్ అవర్ అత్యంత విలువైనది

ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో కార్యక్రమం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ వారు ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ ఆదేశాలపై, ట్రాఫిక్ క్రాస్ రోడ్ పార్కు లో ఎన్.సి.సి క్యాడెట్‌ ల కోసం ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ రావు  క్రమ శిక్షణ తో కూడిన డ్రైవింగ్ సురక్షిత ప్రయాణం పై,ఎన్.సి.సి క్యాడెట్‌ లకు ట్రాఫిక్ నియమ నిబం ధనలు పాటిం చాలని అవగాహన నిర్వహిం చినారు.ఏలూరు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్  లక్ష్మణ రావు ఆధ్వ ర్యంలో సుమారు 150 మంది ఎన్.సి.సి క్యాడెట్‌లకు రహదారి నిబంధన లపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కమాండెంట్ కల్నల్ అమిస్ పాండా మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం అనేది కేవలం నిబంధన మాత్రమే కాదు, అది ప్రాణ రక్షణకు అత్యంత ముఖ్యమని వివరించారు.ప్రమాదం జరిగిన మొదటి గంట గోల్డెన్ అవర్ అత్యంత విలువైనదని,ఆ సమయంలో బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారిని ప్రభుత్వం గుడ్ సమారిటన్గా గుర్తిస్తుందని తెలిపారు. అటువంటి వారికి ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని భరోసా ఇచ్చారు.రహదారి ప్రమాద బాధితులకు తక్షణ ఆర్థిక మరియు వైద్య సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్డు యాక్షన్ హెల్ప్ అండ్ అసోసియేషన్స్ అసిస్టెన్స్   పథకం గురించి క్యాడెట్‌ లకు వివరించారు.అతివేగం ప్రాణాంతకం అని హెచ్చరిస్తూ, మైనర్ల కు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదా లను, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే ఎదురయ్యే చట్టపరమైన చర్యలను తెలియజేశారు.క్రమశిక్షణకు మారుపేరైన ఎన్.సి.సి క్యాడెట్‌ లు సమాజంలో ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పించడంలో అంబాసిడర్లుగా పనిచేయాలని, చట్టాన్ని గౌరవిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అధికారులు పిలుపునిచ్చారు. పోలీస్ మరియు ఎన్.సి.సి విభాగాల నుండి పలువురు అధికారులు పాల్గొన్నారు.

About Author